
కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నబిన్నం అయ్యిందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను కూడా గత ప్రభుత్వం తీసుకురాలేకపోయిందని విమర్శించారు. 2024, జూన్ 27వ తేదీ రాష్ట్ర సచివాలయంల మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడుతూ.. మేము దొంగతనం చేస్తాం.. కానీ మమ్మల్ని ఎవరు అడగొద్దు అనేలా బీఆర్ఎస్ వాదన ఉందని ఎద్దేవా చేశారు.
ఏ కమిషన్ వేసినా.. కమిషన్ ను ప్రశ్నించడం.. ఎదురు దాడి చేయడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు చెప్పినట్టు విందామని.. ప్రతి అంశం అసెంబ్లీలోనే చర్చిద్దామన్నారు. అసెంబ్లీకి రమ్మంటే..కేసీఆర్ రారని విమర్శించారు. చత్తీస్ ఘడ్ విద్యుత్ ఒప్పందాలపై కూడా అసెంబ్లీలో చర్చిస్తామని అన్నారు. బీఆర్ఎస్ కు అసెంబ్లీలో ఏ అంశాలు ఎత్తుకోవాలో తెలవడం లేదన్నారు.
రాష్ట్రంలో రైతు రుణమాఫీని దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేకపోయారని అద్దంకి చెప్పారు. ఇప్పుడు మళ్లీ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుందని తెలిపారు. దీనిపై కూడా బీఆర్ఎస్ నాయకులు విమర్శల చేస్తున్నారని మండిపడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతి వల్ల నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. కమిషన్లను తప్పుపట్టడం.. విచారణ తప్పుపట్టడం బీఆర్ఎస్ మానుకోవాలని సూచించారు. ఇంకా ప్రభుత్వంలో ఉన్నట్లు భ్రమ పడకండని అయన అన్నారు.
జాబ్ క్యాలెండర్ ను ప్రిపేర్ చేస్తున్నాం.. ప్రభుత్వాన్ని అబాసు పాలు చేసే వాళ్ళ ట్రాక్ లో నిరుద్యోగులు పడొద్దని దయాకర్ కోరారు. సామాన్యుడు చెబితే కూడా కాంగ్రెస్ వింటదన్నారు. ఇచ్చిన అన్ని గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తుందని దయాకర్ చెప్పారు.