గుర్తుంచుకోండి.. ఒక్క చిన్న తప్పు జీవితాంతం కుమిలిపోయేలా చేస్తది: సీపీ సజ్జనార్

గుర్తుంచుకోండి.. ఒక్క చిన్న తప్పు జీవితాంతం కుమిలిపోయేలా చేస్తది: సీపీ సజ్జనార్

హైదరాబాద్: హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ సోషల్ మీడియాలో యాక్టివ్‎గా ఉంటారు. సామాజిక అంశాలు, రోడ్డు భద్రత, ఆన్ లైన్ బెట్టింగ్, సైబర్ నేరాల పట్ల నెటిజన్లకు అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా ఆయన ప్రభుత్వ ఉద్యోగులపై బెదిరింపులు, దాడులకు పాల్పడే వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన, బెదిరింపులకు దిగిన, దాడులు చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే భారత న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని 221, 132, 121(1) సెక్షన్స్ ప్రకారం బాధ్యుల‌పై క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని.. హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని చెప్పారు. గుర్తుంచుకోండి.. ఒక్కసారి కేసు న‌మోదైతే భ‌విష్యత్ అంధ‌కార‌మ‌య్యే ప్రమాదం ఉంటుందని.. పాస్ పోర్టు జారీకి, ప్రభుత్వ ఉద్యోగానికి ఇబ్బందులు వ‌స్తాయని తెలిపారు. క్షణికావేశంలో చేసే చిన్న చిన్న త‌ప్పులు జీవితాంతం కుమిలిపోయేలా చేస్తాయన్నారు. 

►ALOS READ | వచ్చే రెండేండ్లలో అన్ని గ్రామాల్లో లైబ్రరీలు.. చెన్నూరు నుంచే ఈ కార్యక్రమం స్టార్ట్: మంత్రి వివేక్