హైదరాబాద్: రోజు రెండు గంటలు లైబ్రరీలో గడపాలని.. లైబ్రరీకి వెళ్తే అన్ని సబ్జెక్టులపై అవగాహన వస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం (నవంబర్ 20) స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో జరిగిన 58వ జాతీయ లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్ కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రంథాలయానికి వాడాల్సిన నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని విమర్శించారు.
రూ.1500 కోట్లకు లైబ్రరీకి వాడాల్సి ఉండేదని చెప్పారు. పుస్తకాలన్నింటిని డిజిటలైజేషన్ చేయాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి లైబ్రరీ ఉండాలని.. వచ్చే రెండేండ్లలో అన్ని గ్రామాల్లో లైబ్రరీలు ఏర్పాటు చేస్తామన్నారు. తన నియోజకవర్గం చెన్నూరు నుంచే ఈ కార్యక్రమం మొదలుపెడ్తామని చెప్పారు. లైబ్రరీకి ధానం చేస్తే.. సొసైటీకి చేసినట్లేనని అన్నారు.
►ALSO READ | వేముల వాడ రాజన్న ఆలయంలో నాగుపాము ప్రత్యక్షం..
