హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. సైఫాబాద్ పీఎస్‌లో ఆయనపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. కేటీఆర్‌తో పాటు గోరటి వెంకన్నపైన నమోదైన ఎఫ్ఆర్ను హైకోర్టు క్వాష్ చేసింది.
కేసు ఏంటంటే..?
2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారని కేటీఆర్, గోరటి వెంకన్నపై సైఫాబాద్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై గురువారం (నవంబర్ 20) హైకోర్టులో విచారణ జరిగింది. సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్థూపం దగ్గర ఎలాంటి అనుమతి లేకుండా గోరెటి వెంకన్నను కేటీఆర్ ఇంటర్వ్యూ చేశారని, అందులో బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరేలా అంశాలు ఉన్నాయని పోలీసుల తరుఫు లాయర్ వాదించారు.
అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేశారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాజకీయ లబ్ధి కోసమే కేసు నమోదు చేశారని కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు.. కేటీఆర్, గోరెటి వెంకన్నపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది.
