Texla Teaser: ఇద్దరు హీరోలను డైరెక్ట్ చేస్తున్న ఐశ్వర్య రజినీకాంత్.. ‘టెక్స్లా’ టీజర్ అదిరిపోయింది అంతే..

Texla Teaser: ఇద్దరు హీరోలను డైరెక్ట్ చేస్తున్న ఐశ్వర్య రజినీకాంత్.. ‘టెక్స్లా’ టీజర్ అదిరిపోయింది అంతే..

సూపర్‌‌‌‌స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘టెక్స్లా’ (Texla). కన్నన్ రవి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వర్సటైల్ యాక్టర్స్  జై, సురాజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

శుక్రవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లతా రజినీకాంత్, నిర్మాత ఆర్.బి. చౌదరి, దర్శకుడు బాలా ముఖ్య అతిథులుగా హాజరై టీమ్‌‌కు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ సందర్భంగా  దర్శకురాలు ఐశ్వర్య  రజినీకాంత్ మాట్లాడుతూ ‘మా  చిత్ర ప్రయాణానికి ఇది మంచి ఆరంభం. నాపై, నా టీంపై నమ్మకం ఉంచిన నిర్మాత కన్నన్ రవికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని విజయవంతం చేయడానికి మేమంతా పూర్తి నిబద్ధతతో పని చేస్తాం’ అని అన్నారు. 

ఇటీవలే ‘టెక్స్లా’ టీజర్ రిలీజై మంచి ప్రశంసలు దక్కించుకుంది. “పాతకాలపు గ్రామీణ నేపథ్యంలో సాగే భావోద్వేగ కథగా ఈ చిత్రం ఉండబోతున్నట్టు టీజర్ చూస్తే అర్ధమవుతోంది. మబ్బులు కమ్ముకున్న వాతావరణంలో గడ్డి గుడిసెలో కొంతమంది పిల్లలు ఆసక్తిగా చూస్తుండగా, ఒక వ్యక్తి గాజు ముక్కతో సూర్యరశ్మిని ప్రతిబింబించి తెరపై ‘టెక్స్లా’ టైటిల్‌ను” చూపిస్తాడు. ఇది ఐశ్వర్య రజినీకాంత్‌కు దర్శకురాలిగా కీలకమైన ప్రాజెక్ట్‌గా సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఆనంద్ రాజ్, జి.ఎం. సుందర్, జార్జ్ మారియన్  కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యువన్ శంకర్ రాజా  సంగీతం అందిస్తున్నాడు. దీపక్ రవి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.