T20 World Cup Final: భారత్–న్యూజిలాండ్ మధ్య ఫైనల్.. ఒక్కో టిక్కెట్ ధర? ఆన్‌లైన్ బుకింగ్, ఆఫ్‌లైన్ అప్‌డేట్

 T20 World Cup Final: భారత్–న్యూజిలాండ్ మధ్య ఫైనల్.. ఒక్కో టిక్కెట్ ధర? ఆన్‌లైన్ బుకింగ్, ఆఫ్‌లైన్ అప్‌డేట్

 T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్ 2026 ఎండింగ్ స్టేజ్ కి వచ్చేసింది. సెమీస్ లో ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లాండ్‌ను ఓడించిన భారత్ వరుసగా సెకండ్ టైమ్ ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు టైటిల్ పోరులో సూర్యకుమార్ సేన న్యూజిలాండ్‌తో పోటీ పడనుంది. రేపు (మార్చి 8న) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఫైనల్ పోరు కొనసాగనుంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ టిక్కెట్ల బుకింగ్ ఎలా చేసుకోవాలనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

టిక్కెట్ల బుకింగ్ ఎలా?: 
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టిక్కెట్లు అధికారికంగా బుక్ మై షో, ఐసీసీ పోర్టల్ ద్వారా విక్రయిస్తున్నారు. టిక్కెట్లకు భారీ డిమాండ్ ఉండటంతో ప్రస్తుతం చాలా కేటగిరీలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. అయితే క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఫైనల్ మ్యాచ్ కోసం వేచిస్తున్నారు. సాధారణంగా పెద్ద మ్యాచ్‌లకు 24 నుంచి 48 గంటల ముందు కొన్ని టిక్కెట్లను మళ్లీ రిలీజ్ చేస్తారు. ముంబైలో జరిగిన సెమీఫైనల్ లో ఇలాగే జరిగింది. టిక్కెట్లు దొరకని అభిమానులు అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్‌ను గమనిస్తూ ఉండాలని అధికారులు పేర్కొన్నారు. 

టిక్కెట్ ధర?: 
ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ ధర.. స్టేడియంపై స్టాండ్‌ల కోసం ప్రారంభ ధర రూ. 3000 నుంచి స్టార్ట్ అవుతుంది.  ఇక ప్రీమియం అండ్ క్లబ్ లాంజ్ సీట్ల ధర సుమారు రూ. 50 వేల నుంచి రూ. 75 వేల మధ్యలో ఉండగా, అభిమానులకు 15 -, 25 వేల మధ్యలో టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని ఆసక్తిగా ఎదురు వేచి చూస్తున్నారు.

ALSO READ :  నేను ఇండియా మ్యాచ్‌లు చూడను..

స్టేడియంలో కఠిన నిబంధనలు: 
ఫైనల్ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. నరేంద్ర మోడీ స్టేడియం గేట్లు సాయంత్రం 4 గంటలకు ఓపెన్ కానున్నాయి. మ్యాచ్ రాత్రి 7 గంటలకు స్టార్ట్ కానుంది. భద్రతా తనిఖీలకు ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉండటంతో. ప్రేక్షకులు కనీసం 3 గంటల ముందే స్టేడియానికి చేరుకోవడం బెటర్.. స్టేడియం లోపలికి పవర్ బ్యాంకులు, బ్యాగులు, నీళ్ల బాటిళ్లు, గొడుగులు లాంటి వస్తువులను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించగా.. ఫ్యాన్స్ కేవలం తమ మొబైల్ ఫోన్, వాలెట్‌ను మాత్రమే లోపలికి తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇస్తారు.  

మ్యాచ్ చూసే వాళ్లకి కీలక సమాచారం:  
అహ్మదాబాద్‌లోని మోతెరా ప్రాంతంలో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ మైదానాల్లో ఒకటి. ఇక్కడ సుమారు 1.3 లక్షల మంది వరకు సీటింగ్ కెపాసిటీ ఉంది. భారీ రద్దీతో మొబైల్ నెట్‌వర్క్ సైతం మ్యాచ్ సమయంలో ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి డిజిటల్ టిక్కెట్‌ను ముందే డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో సేవ్ చేసుకోవాలని అధికారులు తెలియజేస్తున్నారు. కాగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ కేవలం ఒక గేమ్ మాత్రమే కాదు, క్రికెట్ ఫ్యాన్స్ కి పెద్ద పండుగ లాంటిది.