మగవాళ్లలో సంతానోత్పత్తి వేగంగా తగ్గుతోంది..అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు 

మగవాళ్లలో సంతానోత్పత్తి వేగంగా తగ్గుతోంది..అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు 

మగవాళ్లలో సంతానోత్పత్తిపై కొత్త అధ్యయనాలు షాకింగ్ విషయాలను బయటపెట్టాయి. పురుషుల్లో  సంతానోత్పత్తి, స్మెర్మ్ కౌంట్​ పై ఇంతకుముందున్న అభిప్రాయాలకు భిన్నంగా కొత్త పరిశోధనల్లో ఆశ్చర్యపర్చే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళలకంటే పురుషుల్లో సంతానోత్పత్తి వేగంగా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి..

వృద్ధాప్యం, సంతానోత్పత్తి పై ఇంతకుముందుకు అభిప్రాయాలను కొత్త పరిశోధనలు సవాల్​ చేస్తున్నాయి. వయసుతోపాటు స్పెర్మ్​ చాలా వేగంగా క్షీణింస్తుందని, మహిళల అండాలు జన్యుపరంగా ఎక్కువకాలం ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. 

డైజీ వరల్డ్​ లో ప్రచురించిన రిపోర్టు ప్రకారం.. పురుషులు, వయసు పెరిగేకొద్దీ స్పెర్మ్​ నాణ్యత క్షీణ సమస్యలు ఎదుర్కొంటారని తెలుస్తోంది.  అంటే జన్యుపరమైన లోపాలు, గర్భధారణలో సమస్యలు పెరిగే అవకాశాలున్నాయని చెబుతున్నాయి. 

స్పెర్మ్​ ఎందుకు క్షీణిస్తుంది?.

మనిషి జీవిత కాలం స్పెర్మ్​ ఉత్పత్తి అవుతూనే ఉన్నప్పటికీ  నిర్ధిష్ట వయసు తర్వాత స్పెర్మ్​ DNA బాగా మార్పులు వస్తాయి.  ప్రతి కొత్త బ్యాచ్​ లో లోపాలు కనిపించే అవకాశం ఉందని  పరిశోధనల్లో తేలింది. 

►ALSO READ | Childrens care: మీ పిల్లలకు నోట్లో వేలేసే అలవాటు ఉందా..ఇలా మాన్పించండి.. లేదంటే ఇబ్బందులు వస్తాయి..!

మరోవైపు మహిళల అండాలు మాత్రం బలపడతాయని పరిశోధనల్లో తేలింది. లైవ్​ సైన్స్​రిపోర్టు ప్రకారం.. అండాలు వృద్దాప్య నుంచి రక్షించే అంతన్నిర్మిత రక్షణ వ్యవస్థను కలిగి ఉన్నాయని తెలుస్తోంది. 

పురుషులు ,మహిళలు సంతానోత్పత్తిని ప్రభావితం చేసే జీవనశైలి ..

ఒత్తిడి, నిద్రలేమి, పొగతాగడం, మద్యం ,చికిత్స చేయని వైద్య సమస్యలు పురుషులు ,స్త్రీలలో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. వయస్సుతో సంబంధం లేకుండా పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో క్రమం తప్పకుండా తనిఖీలు, సమతుల్య ఆహారం ,ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు డాక్టర్లు.