Childrens care: మీ పిల్లలకు నోట్లో వేలేసే అలవాటు ఉందా..ఇలా మాన్పించండి.. లేదంటే ఇబ్బందులు వస్తాయి..!

Childrens care:  మీ పిల్లలకు నోట్లో వేలేసే అలవాటు ఉందా..ఇలా మాన్పించండి.. లేదంటే ఇబ్బందులు వస్తాయి..!

పిల్లల్లో చాలామందికి నోట్లో వేలేసుకోవడం (బొటనవేలు) అలవాటు. అది నెలల పిల్లల్లో మొదలై మూడునాలుగేళ్ల వరకు కొనసాగుతుంది. అయితే ఏళ్లుపెరుగుతున్న కొద్దీ ఈ అలవాటు మానకపోతే, వాళ్లలో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. 

పాల పళ్లు ఊడి పోయాక, శాశ్వత దంతాలు వచ్చేటప్పటికీ ఈ నోట్లో వేలేసు కునే అలవాటు మానకపోతే... ఆ వచ్చే పళ్లు కొక్కిరిబిక్కిరిగా వస్తాయట. అలాగే బొటనవేలి ఒత్తిడి ఆపళ్లపై పడటం వల్ల, దాని ప్రభావం కింది దవడ, పై దవడలపై పడి మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. అలాగే వేళ్లను సక్ చేయడం నత్తికి కూడా దారి తీస్తుంది. 

ALSO READ :  రెగ్యులర్ హెల్త్.. బీపీ.. చెకప్.. గుండెపోటుకు నివారణ

అందుకే వీలైనంత తొందరగా పిల్లల్లో ఆ అలవాటును మాన్పించాలి. అది మంచి పని కాదని వారిస్తూ ఉంటే, కొన్ని రోజుల్లోనే వాళ్లు ఆ అలవాటును మానేస్తారు. అలాగే చాలామంది పిల్లలు నోట్లో వేలేసుకుంటే కానీ నిద్ర పోరు. అలాంటి పిల్లలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాళ్లకు నిద్రొచ్చే సమయానికి ఆ వేళ్లకు సాక్స్, గ్లౌజ్ లాంటివి తొడగాలి. మామూలు సమయాల్లో కూడా వాటిని తొడిగితే వేలేసుకోవడం త్వరగా మానేస్తారు

వెలుగు,లైఫ్​