ప్రస్తుతం జనాలు ప్రతి దానికి టెన్షన్ పడుతున్నారు. పొద్దున్నే లేచిన దగ్గరి నుంచి పడుకొనేంత వరకు ఒత్తిడికి లోనవుతున్నారు. దీని వలనే బీపీ పెరిగి గుండెపోటుకు దారితీస్తుందని పరిశోధకులు ఓ అధ్యయనంలో తెలిపారు. రెగ్యులర్ హెల్త్ చెకప్ తో హార్ట్ స్ట్రోక్ కు చెక్ పెట్టవచ్చని నివేదికలో పేర్కొన్నారు.
- గుండెపోటుతో చనిపోయే వాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అందులో రక్తపోటుతో బాధ పడుతున్నవాళ్లే ఎక్కువ మంది ఉన్నారని నిపుణులు ఇంటున్నారు. రక్తపోటు వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వాళ్లు హెచ్చరిస్తున్నారు. కానీ సరైన చికిత్స తీసుకుంటే హార్ట్ స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చన్నారు.
- బ్రిటీష్ హార్ట్ఫౌండేషన్" ఇచ్చిన నివేదిక ప్రకారం... రక్తపోటును సరైన సమయంలో గుర్తించి ట్రీట్ మెంట్ తీసుకోకపోవడం వల్లే చాలా మంది చనిపోతున్నా డు. సరైన చికిత్స అందిస్తే ఏటా 'లక్షా పదిహేను వేల మందిని కాపాడొచ్చని ఆ నివేదికలో పరిశోధకులు తెలిపారు. ప్రపంచంలో లక్ష లాది మందికి రక్తపోటు ఉందనే విషయం కూడా తెలియదు. గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఎంతో మంది సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల చనిపోయారు.
- రక్తపోటుపై అవగాహన లేక చికిత్సను నిర్లక్యం చేస్తే వేలాదిమంది చనిపోయే ప్రమాదం ఉందని నివేదికలో వెల్లడించారు. దీన్ని నివారించాలంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. రక్తపోటుపై అవగాహన కల్పించా బి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు హెల్త్ చెక్ చేయించుకోవాలి కొందరికి రక్తపోటు ఉన్నా గుర్తించడం కష్టం. దాన్ని కేవలం హెల్త్ చెకప్ చేయించుకోవడం వల్ల మాత్రమే గుర్తించగలుగుతామని పరిశోధకులు చెబుతున్నారు.
వెలుగు,లైఫ్
