హైదరాబాద్: నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన వైఎస్ జగన్ కోర్టు హాల్లో 5 నిమిషాలు మాత్రమే కూర్చున్నారు. సీబీఐ కోర్టులో న్యాయమూర్తి ముందు జగన్ హాజరయ్యారు. ఈ సమయంలో.. మీరేమైన చెప్పదల్చుకున్నారా అని సీబీఐ కోర్టు న్యాయమూర్తి వైసీపీ అధినేతను అడిగారు. No అని జగన్ తరపు న్యాయవాది జవాబు చెప్పారు. అనంతరం.. జగన్ వ్యక్తిగత హాజరును న్యాయ స్థానం రికార్డ్ చేసింది. అటెండ్స్ పూర్తి అయిన తరువాత కోర్టు నుంచి జగన్ బయటకు వెళ్లిపోయారు. జగన్ హాజరైనట్టు సీబీఐ కోర్టు రికార్డులో నమోదు చేసింది.
నాంపల్లి సీబీఐ కోర్టు నుంచి ఆయన నేరుగా లోటస్ పాండ్లోని తన నివాసానికి వెళ్లారు. మధ్యాహ్నం దాదాపు 2 గంటల సమయంలో లోటస్ పాండ్ నివాసం నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు జగన్ వెళ్లారు. బేగంపేట నుంచి బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు జగన్ బయలుదేరతారు. సాయంత్రానికి జగన్ బెంగళూరుకు చేరుకుంటారు.
►ALSO READ | ఎర్రకోట దాడిలో ఇస్లామాబాద్ ప్రమేయం.. పాక్ నేత షాకింగ్ కామెంట్స్..
ఏపీ మాజీ సీఎం జగన్ కోర్టు అనుమతితో ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చారు. గురువారం నాంపల్లి సీబీఐ కోర్టులో ఆయన అటెండెన్స్ ఇవ్వడానికి హైదరాబాద్ వచ్చారు. జగన్ అభిమానులు భారీగా చేరుకుని బేగంపేట ఎయిర్ పోర్టులో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యకర్తల నినాదాలతో బేగంపేట విమానాశ్రయ ప్రాంగణం మార్మోగింది. సీఎం సీఎం అంటూ.. వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
