జియో 5G యూజర్లకు గుడ్ న్యూస్..జెమిని ప్రోతోపాటు జెమిని 3మోడల్ AI ఉచితం

జియో 5G యూజర్లకు గుడ్ న్యూస్..జెమిని ప్రోతోపాటు జెమిని 3మోడల్ AI ఉచితం

ప్రముఖ  టెలికం సంస్థ జియో తన కస్టమర్లకు ఆకట్టుకునే ఆఫర్లను అందిస్తోంది.. బడ్జెట్​ రీచార్జ్ ప్లాన్లతో పాటు బెస్ట్​ఆఫర్లను తీసుకొస్తుంది.. ఇందులో భాగంగా ఏడాదిన్నర పాటు జియో జెమిని ప్రో ప్లాన్​ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.. ఇది బుధవారం నుంచి ఈ ఆఫర్​ అందుబాటులో ఉంది.. అయితే ఈ ప్లాన్​ లో తాజా జెమిని 3 మోడల్ ను కూడా చేర్చింది.. అంటే జియో యూజర్ల కు డబుల్​ ధమాకా అన్నమాట. 35వేల విలువైన జెమిని జియోప్లాన్​ ను 18 నెలల పాటు ఉచింతంగా అందిస్తున్న ప్రైవేట్ టెలికం సంస్థ జియో. 

ఎలా యాక్టివేట్ చేసుకోవాలి?

Myjio యాప్​ లోకి వెళ్లి ఈ ఫార్​ ను వెంటనే యాక్టివేట్​ చేసుకోవచ్చు. జియో జెమినీ ప్రోప్లాన్​ లో భాగంగా జెమిని 3 ని రోల్​ అవుట్​ చేస్తుంది. ఇది అన్ని జియో అన్​ లిమిటెడ్​ 5 G కస్టమర్లకు 18 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. జెమిని 3మోడల్​ జెమిని మోడల్స్​ కన్నా అడ్వాన్డ్స్​ అని జియో ప్రకటించింది. 

►ALSO READ | డేంజర్‌లో వాట్సాప్ యూజర్ల డేటా: 350 కోట్ల మంది ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్, వివరాలు లీక్...!

గూగుల్ తాజాగా జెమినీ 3 ప్రో, జెమినీ 3 డీప్ థింక్ మోడళ్లను విడుదల చేసింది. ఇవి రీజనింగ్, చాటింగ్​, కోడింగ్, గణిత విశ్లేషణలో మంచి రిజల్ట్స్​ ఇస్తుందని గూగుల్ చెబుతోంది. జెమినీ 3 ప్రో ఇప్పటికే జెమినీ యాప్, సెర్చ్ లోని ఏఐ మోడ్, ఏఐ స్టూడియో, వర్టెక్స్ ఏఐతో పాటు కొత్తగా రూపొందించిన యాంటీగ్రావిటీ డెవలప్మెంట్ ప్లాట్​ ఫాంలలో అందుబాటులోకి వచ్చింది. 

జెమినీ 3 ప్రో మునుపటి మోడళ్లను మాత్రమే కాకుండా ఓపెన్ఏఐ జీపీటీ-5.1, క్లాడ్ 4.5 సోనెట్ వంటి ప్రముఖ మోడళ్లను కూడా పలు కీలక పరీక్షల్లో అధిగమించింది. మరింత శక్తిమంతమైన జెమినీ 3 డీప్ థింక్​ ను  ప్రస్తుతం సేఫ్టీ టెస్టింగ్ దశకు మాత్రమే పరిమితం చేసినట్లు సంస్థ తెలిపింది.