రాంగ్ రూట్ లో వెళ్లి.. బైక్ ను ఢీకొట్టిన కారు..గాల్లోకి ఎగిరిపడ్డ బైకర్.. కారు కెమెరాలో విజువల్స్ రికార్డు

రాంగ్ రూట్ లో వెళ్లి.. బైక్ ను ఢీకొట్టిన కారు..గాల్లోకి ఎగిరిపడ్డ బైకర్.. కారు కెమెరాలో విజువల్స్  రికార్డు

రాంగ్ రూట్‌లో వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో ట్రాఫిక్ పోలీసులు ఎంతగా హెచ్చరించినా, భారీ జరిమానాలు విధిస్తున్నా, వాహనదారుల్లో మార్పు కనిపించడం లేదు. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా బైకులు, కార్లు రాంగ్​ రూట్​ లో నడిపితే డ్రైవర్లకే కాదు ఎదురుగా వస్తున్న ప్రయాణికులకు ప్రాణహాని కలిగిస్తుంది. 

నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన ఒక్క క్షణం కేవలం ప్రమాదానికే కాదు..కొన్ని కొన్ని సార్లు ప్రాణ నష్టానికీ కారణమవుతోంది. చాలామంది బైకర్లు, కార్లు నడిపేవాళ్లు కొద్దిపాటి సమయం ఆదా చేసుకోవాలనే తొందరపాటుతో, తమ ప్రాణాలను, ఎదుటివారి ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారు. 

సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండలం జక్కాపూర్​శివారులో రాంగ్​ రూటులో కారు వేగంగా వెళ్లి బైకును ఢీకొట్టడంతో బైకర్​కు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కారు లో అమర్చిన కెమెరాల్లో రికార్డయ్యాయి. 

►ALSO READ | మిర్యాలగూడలో నకిలీ బంగారం ముఠా అరెస్ట్.. 20 తులాల ఫేక్ గోల్డ్ సీజ్

పూర్తిగా రాంగ్​ రూటులో వెళ్లి కారు ఎదురుగా బైక్​ ను ఢీకొట్టింది.. బైకు పై వెళ్తున్న ఇద్దరు గాల్లోకి ఎగిరి కిందపడ్డ దృశ్యాలు సీసీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.  కారు డ్రైవర్​ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.పెరుగుతున్న నిర్లక్ష్యపు రాంగ్​ రూటు డ్రైవింగ్​ కు ఇదొక ఉదాహరణ.