మిర్యాలగూడలో నకిలీ బంగారం ముఠా అరెస్ట్.. 20 తులాల ఫేక్ గోల్డ్ సీజ్

మిర్యాలగూడలో నకిలీ బంగారం ముఠా అరెస్ట్.. 20 తులాల ఫేక్ గోల్డ్ సీజ్

హైదరాబాద్: మిర్యాలగూడలో నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి రూ.5 లక్షల నగదు, 200 గ్రాముల నకిలీ బంగారం, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ రాజశేఖర్ రాజ్ సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో గురువారం (నవంబర్ 20) కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.

కర్ణాటక రాష్ట్రంలోని కోసిపేట్‎కి చెందిన నిందితులు తమకు తవ్వకాల్లో బంగారు నాణ్యాలు దొరికాయని జనాల్ని బురిడి కొట్టిస్తున్నారని తెలిపారు. జనాల్ని నమ్మించేందుకు మొదట అసలు బంగారం చూపించి తర్వాత నకిలీ బంగారం విక్రయిస్తున్నారని చెప్పారు. బంగారం కొన్నవారు పరీక్షించగా అసలు మోసం బయటపడిందని తెలిపారు. 

►ALSO READ | కేటీఆర్‎పై చట్ట ప్రకారమే చర్యలు.. కక్ష సాధింపైతే ఎప్పుడో అరెస్ట్ చేసేవాళ్లం: పీసీసీ చీఫ్ మహష్ గౌడ్

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టమన్నారు. ఈ క్రమంలోనే నకిలీ బంగారంతో మోసాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా సభ్యుడు ఒకరిని అరెస్ట్ చేశామని చెప్పారు. ముఠాలోని మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని.. వాళ్ల కోసం తీవ్రంగా గాలిస్తున్నామని తెలిపారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.