అగ్ని ప్రమాదం కాదు.. అప్పుల బాధతో ఓనరే తగలబెట్టిండు: కరీంనగర్ మహాలక్ష్మి ఫ్యాషన్ మాల్ కేసులో వీడిన మిస్టరీ

అగ్ని ప్రమాదం కాదు.. అప్పుల బాధతో ఓనరే తగలబెట్టిండు: కరీంనగర్ మహాలక్ష్మి ఫ్యాషన్ మాల్ కేసులో వీడిన మిస్టరీ

హైదరాబాద్: కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని మహాలక్ష్మి ఫ్యాషన్ మాల్‎లో 2025, నవంబర్ 17న అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మాల్ ఓనర్ రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విచారణలో అసలు విషయం బయటపడింది. మహాలక్ష్మి ఫ్యాషన్ మాల్ దగ్ధం కావడానికి కారణం అగ్ని ప్రమాదం కాదని.. అప్పుల బాధతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం యజమానే నిప్పంటించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని తేల్చారు పోలీసులు. 

మాల్ నుంచి విలువైన బట్టలను ముందుగానే రహస్యంగా తరలించి అనంతరం షాపులో పెట్రోల్ పోసి రాకేశ్, మధు నిప్పు పెట్టారని తెలిపారు. తర్వాత ఏమీ తెలియనట్లు నటిస్తూ యజమాని రాజేశ్ డయల్100కు ఫోన్ చేశాడన్నారు. టెక్నికల్ ఆధారాలతో నిందితులను గుర్తించామని తెలిపారు పోలీసులు. పెట్రోల్ బాటిల్, సెల్‌ఫోన్‎తో పాటు, మరో చోట దాచిపెట్టిన విలువైన దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. కుట్రను ఛేదించి ఓనర్ రాజేశ్‎తో పాటు రాకేశ్, మధు అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు కరీంనగర్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి. 

►ALSO READ | గుర్తుంచుకోండి.. ఒక్క చిన్న తప్పు జీవితాంతం కుమిలిపోయేలా చేస్తది: సీపీ సజ్జనార్