BAN vs IRE: దిగ్గజాల సరసన రహీమ్.. 100వ టెస్టులో సెంచరీతో చెలరేగిన బంగ్లా వెటరన్

BAN vs IRE: దిగ్గజాల సరసన రహీమ్.. 100వ టెస్టులో సెంచరీతో చెలరేగిన బంగ్లా వెటరన్

బంగ్లాదేశ్ సీనియర్ ప్లేయర్ ముష్ఫికర్ రహీమ్ దిగ్గజాల సరసన చేరాడు. 100 టెస్టులాడిన తొలి బంగ్లాదేశ్ ప్లేయర్ గా చరిత్ర సృష్టించడమే కాదు.. తన 100వ టెస్టులో సెంచరీ చేసి తన ఇన్నింగ్స్ ను చిరస్మరణీయం చేసుకున్నాడు. తొలి రోజు ఆటలో భాగంగా 99 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ఈ వెటరన్ ప్లేయర్.. గురువారం (నవంబర్ 20) రెండో రోజు ఆటలో ఒక పరుగు పూర్తి చేసి తన తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో 100వ టెస్టులో సెంచరీ చేసిన 11 ప్లేయర్ గా నిలిచాడు. జో రూట్, డేవిడ్ వార్నర్, గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, జావేద్ మియాందాద్, గోర్డాన్ గ్రీనిడ్జ్, హషీమ్ ఆమ్లా వంటి స్టార్ ఆటగాళ్ల సరసన రహీమ్ చేరాడు. 

రూట్, వార్నర్ మాత్రమే తమ 100వ టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించారు. రహీం టెస్ట్ కెరీర్ లో ఇది 13వ సెంచరీచేసి బంగ్లాదేశ్ తరపున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా మోమినుల్ హక్ తో సమంగా ఉన్నాడు. 2005లో తన తొలి టెస్ట్ క్యాప్‌ను అందజేసిన బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ హబీబుల్ బషర్ సుమోన్ తన 100వ టెస్టుకు కూడా క్యాప్‌ను అందజేయడం విశేషం. 20 ఏళ్ళ తన కెరీర్ ను ఈ మాజీ కెప్టెన్ విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో రహీం 106 పరుగులు చేసి ఔటయ్యాడు. 100 టెస్ట్ మ్యాచ్ లాడితే 183 ఇన్నింగ్స్ ల్లో 6457 పరుగులు చేశాడు. వీటిలో 13 సెంచరీలు.. 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

బంగ్లాదేశ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రహీం కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి రోజు ఆటలో భాగంగా  రహీం రెండు కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాడు. మోమినుల్ హక్ (63)తో కలిసి 107 పరుగులు.. ఆ లిటన్ దాస్ (128)తో కలిసి 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలి మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 476 పరుగులకు ఆలౌట్ అయింది. రహీం (106)తో పాటు వికెట్ కీపర్ లిటన్ దాస్ (128) సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో ఐర్లాండ్ రెండో రోజు అట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.