Smriti Mandhana: ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేసిన స్మృతి మంధాన.. వీడియో వైరల్

Smriti Mandhana: ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేసిన స్మృతి మంధాన.. వీడియో వైరల్

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తన ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు కన్ఫర్మ్ చేసింది. గురువారం (నవంబర్ 20) టీమిండియా ప్లేయర్స్ తో ఒక రీల్ ద్వారా తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూపిస్తూ పలాష్ ముచ్చల్‌తో నిశ్చితార్ధం జరిగినట్టు క్లారిటీ ఇచ్చింది. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో  జెమిమా రోడ్రిగ్స్, శ్రేయంకా పాటిల్, రాధా యాదవ్‌లతో డ్యాన్స్ రీల్ చేస్తూ ఈ సంతోషకర క్షణాన్ని పంచుకుంది. 2006 బాలీవుడ్ చిత్రం లగే రహో మున్నా భాయ్‌లోని మెలోడీ  "సమ్ఝో హో హి గయా" పాటకు డ్యాన్స్ చేసి తన ఎంగేజ్ మెంట్ విషయాన్ని వెరైటీగా చెప్పింది. 

సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ రిలేషన్ షిప్‎లో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే.. తమ బంధాన్ని స్మృతి కానీ పలాష్ కానీ అధికారికంగా ఎప్పుడు ధృవీకరించలేదు. ఈ క్రమంలో స్మృతి మందానతో రిలేషన్ షిప్, పెళ్లి గురించి తొలిసారి అఫిషియల్‎గా కన్ఫామ్ చేశాడు పలాష్ ముచ్చల్. స్మృతి తాను రిలేషన్‎లో ఉన్నది వాస్తవమేనని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నామని కుండబద్దలు కొట్టాడు. ఇండోర్‌లోని స్టేట్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పలాష్ ముచ్చల్.. మంధాన త్వరలో ఇండోర్‌కు కోడలు అవుతుందని తెలిపాడు. 

పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన వివాహం ఎప్పుడు జరుగుతుందో ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం స్మృతి మంధాన భారత మహిళల వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ లో సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్న మందాన ఇటీవలే టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ టోర్నీలో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 54.22 సగటుతో 434 పరుగులు చేసి ఇండియా టాప్ స్కోరర్ గా నిలిచింది. 

ఎవరీ పలాశ్‌ ముచ్చల్‌..?

పలాష్ ముచ్చల్ 29 ఏళ్ల మ్యూజిక్ కంపోజర్, ఫిల్మ్ మేకర్. అతని సోదరి పాలక్ ముచ్చల్ బాలీవుడ్ గాయని. పలాశ్‌.. 'రిక్షా' అనే వెబ్ సిరీస్‌కి.. 'అర్ద్' అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇతను టీ సిరీస్, జీ మ్యూజిక్ కంపెనీలకు పలు మ్యూజిక్ వీడియోలు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఇతను ఆశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘ఖేలే హమ్‌ జీ జాన్‌ సే’ లో అభిషేక్ బచ్చన్‌, దీపికా పదుకొణెతో కలిసి నటించాడు.

►ALSO READ | BAN vs IRE: దిగ్గజాల సరసన రహీమ్.. 100వ టెస్టులో సెంచరీతో చెలరేగిన బంగ్లా వెటరన్

ఇక మందాన విషయానికొస్తే.. గత దశాబ్దకాలంగా భారత మహిళా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికా మహిళలతో జరిగిన వన్డే సిరీస్ లో రెండు వరుస సెంచరీలు సాధించి ఔరా అనిపించింది. మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన క్రీడాకారిణి(రూ. 3 కోట్ల 40 లక్షలి)గా నిలిచింది. తన సారథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ మహిళా టీమ్) జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ సాధించి పెట్టింది.

వీరి వివాహం ఎప్పుడు జరుగుతుందో ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం స్మృతి మంధాన భారత మహిళల వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ లో సూపర్ ఫామ్ తో దూసుకెళ్తున్న మందాన ఇటీవలే టీమిండియా వరల్డ్ కప్ గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ టోర్నీలో తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 54.22 సగటుతో 434 పరుగులు చేసి ఇండియా టాప్ స్కోరర్ గా నిలిచింది.