మమత పోకుంటే ఆకాశం పడిపోయేదా.?: అధిర్ రంజన్ చౌదరి

మమత పోకుంటే ఆకాశం పడిపోయేదా.?: అధిర్ రంజన్ చౌదరి

కోల్‌‌కతా: రాష్ట్రపతి ఇచ్చిన జీ20 డిన్నర్‌‌కు ఇండియా కూటమిలోని కీలక నేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హాజరుకావడంపై కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు." జీ20 విందుకు మమత వెళ్లకపోయుంటే..ఆకాశమేమీ ఊడిపడేది కాదు. మత గ్రంథాలు అపవిత్రమేమి అయ్యేవి కావు.

మరి ఆమె ఈ విందులో  పాల్గొనడానికి ఇంకేమైనా కారణముందా.?. డిన్నర్ టేబుల్ వరుసలో  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పక్కన మమత కూర్చున్నారు. ఇండియా కూటమిలోని నేతలెవరూ ఈ విందుకు అటెండ్ కాలేదు. కానీ మమత మాత్రం విందు శనివారమయితే శుక్రవారమే ఢిల్లీ చేరుకున్నారు" అని అధీర్ చౌదరి విమర్శలు చేశారు.