హైదరాబాద్ నుంచి మరో వ్యాక్సిన్ వస్తుంది

హైదరాబాద్ నుంచి మరో వ్యాక్సిన్ వస్తుంది

హైదరాబాద్ నుంచి మరో వ్యాక్సిన్ వస్తుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. ఆదివారం సితాఫల్ మండిలో హైరిస్క్ గ్రూపు వ్యాక్సినేషన్ సెంటర్ ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. డిసెంబర్ వరకు 250 కోట్ల డోసుల ఉత్పత్తే టార్గెట్ గా కేంద్రం ముందుకెళ్తోందని చెప్పారు. డిసెంబర్ చివరి నాటికి ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. 16 కంపెనీలతో కేంద్రం చర్చలు జరుపుతోందన్నారు కిషన్ రెడ్డి. ఇప్పటి వరకు తెలంగాణ కొనుగోలు చేసింది నాలుగున్నర లక్షల డోసులేనన్నారు. 75 లక్షల డోసులు డోసులే కేంద్రం ఉచితంగా ఇచ్చిందన్నారు. మరోవైపు నిన్న మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. ఇతర ప్రదేశాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ ఇక్కడకు రావటం లేదా అని ప్రశ్నించారు.