మకావు ఓపెన్‌‌ సూపర్‌‌–300 టోర్నీ: సెమీస్లో అష్మిత

మకావు ఓపెన్‌‌ సూపర్‌‌–300 టోర్నీ: సెమీస్లో అష్మిత

మకావు: ఇండియా షట్లర్‌‌ అష్మితా చాలిహా.. మకావు ఓపెన్‌‌ సూపర్‌‌–300 టోర్నీలో సెమీస్‌‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో అష్మిత 21–16, 21–18తో కిమ్‌‌ మిన్‌‌ సన్‌‌ (కొరియా)పై వరుస గేమ్‌‌ల్లో గెలిచింది.

గాయం కారణంగా మూడు నెలలు ఆటకు దూరమైన అష్మిత.. ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్‌‌ టూర్‌‌ ఈవెంట్‌‌లో సెమీస్‌‌కు చేరడం ఇదే తొలిసారి. మరో మ్యాచ్‌‌లో అన్మోల్‌‌ ఖర్బ్‌‌ 21–14, 15–21, 13–21తో హాన్‌‌ కియాన్స్‌‌ కీ (చైనా) చేతిలో పోరాడి ఓడింది.