మీడియా ప్రతినిధులను బయటకు పంపిన పోలీసులు

మీడియా ప్రతినిధులను బయటకు పంపిన పోలీసులు

టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి సర్వం సిద్ధమైంది. తెలంగాణ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం పార్టీ వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. పలువురు టీఆర్ఎస్ లీడర్లు తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే టీఆర్ఎస్ సమావేశం నేపథ్యంలో పోలీసులు తెలంగాణ భవన్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. అయితే భవన్ లోకి కనీసం మీడియాను అనుమతించడంలేదు. లోపల ఉన్న మీడియా ప్రతినిధులను పోలీసులు బలవంతంగా బయటకు పంపుతున్నారు. లీడర్ల సెల్ ఫోన్లను సైతం వారు లోపలికి అనుమతించడం లేదు. మరోవైపు జనతాదళ్ నేత కుమార స్వామి, తమిళనాడు ఎంపీ తిరుమావళవన్ సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ వారితో కలిసి టిఫిన్ చేశారు.