మెల్‌బోర్న్: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు షాక్ తగిలింది. రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసిన వరల్డ్ నం.1 జొకో వీసాను ఆస్ట్రేలియా గవర్నమెంట్ సెకండ్ టైమ్ క్యాన్సిల్ చేసింది. ఈ మేరకు ఇమ్మిగ్రేషన్ మినిస్టర్ అలెక్స్ హాకే తన పవర్స్‌ను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నారు. పబ్లిక్ హెల్త్‌ను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. వీసా క్యాన్సిల్ కావడంతో జొకోను మరోసారి డిపోర్టేషన్లోకి తీసుకోవాలని అఫీషియల్స్ రెడీ అవుతున్నారు. అదే టైమ్‌లో గవర్నమెంట్ నిర్ణయాన్ని జొకో లాయర్లు ఫెడరల్ సర్క్యూట్ కోర్టులో మరోసారి అప్పీల్ చేశారు. దీనిపై శనివారం విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నొవాక్ ఆడతాడో లేదో డౌట్‌గా మారింది. ఇక సెకండ్ టైమ్ వీసా క్యాన్సిల్ వల్ల జొకో.. మూడేళ్లు ఆస్ట్రేలియాలో అడుగుపెట్టకుండా బ్యాన్ పడే అవకాశం ఉంది. అయితే పరిస్థితులను బట్టి దీనిలో మార్పు ఉండొచ్చు.

