బషీర్బాగ్, వెలుగు: బీసీ రిజర్వేషన్ల కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సాయి ఈశ్వరచారిదే చివరి మరణం కావాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం గన్ పార్కు అమరవీరుల స్తూపం వద్ద ఈశ్వరచారికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్లే ఈశ్వరచారి బలిదానం చేసుకున్నారని ఆరోపించారు. ఆయన మృతిపై సీఎం స్పందించకపోవడం బాధాకరమన్నారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. గుజ్జ కృష్ణ, గణేశ్ చారి, వేముల రామకృష్ణ పాల్గొన్నారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి..
ముషీరాబాద్: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంటులో బిల్లు పెట్టేలా తెలంగాణ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ డిమాండ్ చేశారు. బుధవారం చిక్కడపల్లిలో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని అన్నారు.

