శిథిలావస్థకు డబుల్ ఇండ్లు.. ఊడి పడుతున్న పెచ్చులు

శిథిలావస్థకు డబుల్ ఇండ్లు.. ఊడి పడుతున్న పెచ్చులు
  • ఐడీహెచ్ కాలనీలో హౌసింగ్ ​ఎండీ, బల్దియా బాస్, కలెక్టర్ హరిచందన పరిశీలన
  • త్వరలో ప్రభుత్వానికి నివేదిక

హైదరాబాద్ సిటీ, వెలుగు: సనత్ నగర్ లోని ఐడీహెచ్ డబుల్ బెడ్​రూమ్​కాలనీలో ఇండ్లను మంగళవారం హౌసింగ్​శాఖ ఎండీ, జీహెచ్ఎంసీ కమిషనర్, కలెక్టర్ పరిశీలించారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం బన్సీలాల్​పేట్ డివిజన్ పరిధిలోని ఐడీహెచ్ డబుల్ బెడ్​రూమ్​ కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలను హౌసింగ్ ఎండీ గౌతమ్, కలెక్టర్ హరిచందన దాసరి, బల్దియా కమిషనర్​కర్ణన్​విజిట్​చేశారు. నాలుగు బ్లాకులను చూడగా అందులో చాలామటుకు గోడలు బీటలు వారి, స్లాబుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తామని హౌసింగ్​ఎండీ గౌతమ్​తెలిపారు.

తర్వాత అధికారులు అంగన్వాడీ కేంద్రం, గాంధీ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. మారేడ్​పల్లి అంబేద్కర్ కాలనీలో  పేదల ఇండ్లను పరిశీలించి సమస్యలడిగి తెలుసుకున్నారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ మంగతాయారు, కవాడిగూడ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఆర్ పుష్పలత, సికింద్రాబాద్ ఆర్డీవో సాయిరాం, తహసీల్దార్ పాండు నాయక్ పాల్గొన్నారు.