హైదరాబాద్, వెలుగు: తొలి రెండు మ్యాచ్‌ల్లో మెరుగైన ఆటతో సత్తా చాటిన ఇండియా ఎఫ్‌ఐహెచ్ విమెన్స్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో సెమీఫైనల్‌పై గురి పెట్టింది. గచ్చిబౌలి హాకీ గ్రౌండ్‌లో బుధవారం జరిగే పూల్–బి చివరి మ్యాచ్‌లో వేల్స్ టీమ్‌తో తలపడనుంది.
ప్రస్తుతం 4 పాయింట్లు, మెరుగైన గోల్ డిఫరెన్స్‌తో ఇండియా టాప్ ప్లేస్‌లో ఉంది. తొలి మ్యాచ్‌లో ఉరుగ్వేపై 4–-0తో ఘనవిజయం సాధించిన జట్టు ఆ తర్వాత స్కాట్లాండ్‌తో 2–-2తో డ్రా చేసుకుంది. వేల్స్‌తో మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకున్నా కూడా ఆతిథ్య జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.
