- జనరల్ కోటాలో ఉన్న నిజామాబాద్ మేయర్ స్థానం బీసీ మహిళకు..
- బీసీ రిజర్వేషన్ కింద మరో 35 పీఠాలు కైవసం
హైదరాబాద్, వెలుగు: సోమవారం జరిగిన మేయర్, మున్సిపల్ చైర్పర్సన్ఎన్నికల్లో బీసీలు సత్తాచాటారు. బీసీ రిజర్వేషన్ల కింద 35 స్థానాలు కైవసం చేసుకోవడంతోపాటు జనరల్స్థానాల్లోనూ ఒక మేయర్, 27 మున్సిపల్ చైర్పర్సన్ పీఠాలు సొంతం చేసుకున్నారు. సాధారణంగా జనరల్ స్థానాల్లో ఓసీ (రెడ్డి, వెలమ తదితర) సామాజిక వర్గాల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఈసారి ఆ లెక్కలు మారాయి. సిరిసిల్ల, పోచంపల్లిలాంటి చేనేత ప్రాబల్యం ఉన్న ప్రాంతాలు, నల్గొండ, వనపర్తిలాంటి రాజకీయ చైతన్యం ఉన్న జిల్లాల్లో పార్టీలు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేశాయి. దీంతో బీసీలకు జనరల్ సీట్లలోనూ అవకాశం దక్కింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడం ద్వారా ఎక్కువ మంది బీసీలను జనరల్ స్థానాల్లో గెలిపించుకున్నది. గౌడ, పద్మశాలీ, మున్నూరు కాపు, ముదిరాజ్ సామాజిక వర్గాలకు చెందిన నేతలు జనరల్ సీట్లలో చైర్మన్లుగా కొలువుదీరారు.
సగానికి పైగా బీసీలే..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగాయి. ఇందులో 58 మేయర్/చైర్పర్సన్స్థానాలు ఓపెన్ కేటగిరీ (అన్ రిజర్వ్డ్) కింద ఉన్నాయి. 35 స్థానాలను బీసీలకు రిజర్వ్ చేశారు. ఇక116 మున్సిపాలిటీల్లో వివిధ కారణాల వల్ల 11 చోట్ల చైర్పర్సన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. సోమవారం ఎన్నికలు జరిగిన చోట్ల జనరల్ స్థానాల్లోనూ ఒక మేయర్, 27 మంది మున్సిపల్ చైర్పర్సన్లుగా బీసీలు విజయం సాధించారు. ఏడు కార్పొరేషన్లలో నిజామాబాద్ మేయర్ స్థానం జనరల్ కోటాలో ఉన్నప్పటికీ బీసీ మహిళ దక్కించుకోవడం విశేషం.
జనరల్ స్థానాల్లో గెలిచిన బీసీ చైర్మన్లు/మేయర్లు
మొత్తం 35 బీసీ స్థానాల్లో (జనరల్ + మహిళా) గెలిచినవారి వివరాలు..
బీసీ మహిళా రిజర్వ్డ్ స్థానాల్లో గెలిచిన చైర్‌పర్సన్లు
