- నమో వందే గోమాతరం నేషనల్ ప్రెసిడెంట్ సురేశ్
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోని అన్ని భాషల సాహితీ గ్రంథాలకు దక్కని అరుదైన ఘనత కేవలం భగవద్గీతకు మాత్రమే దక్కిందని నమో వందే గోమాతరం నేషనల్ ప్రెసిడెంట్సురేశ్ అన్నారు. సోమవారం త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీలో జరిగిన భగవద్గీత పారాయణానికి సురేశ్హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడారు. ఒక గ్రంథానికి జయంతి నిర్వహించడం కేవలం భగవద్గీతకే చెల్లిందని తెలిపారు.
యావత్ మానవజాతి బాధల్ని పోగొట్టే శక్తి కేవలం భగవద్గీతకు మాత్రమే ఉందని చెప్పారు. అందుకే భగవద్గీతకు మాత్రమే జయంతి చేయడం ఆచారంగా మారిందని పేర్కొన్నారు. భగవంతుడితో సమానంగా భగవద్గీత పూజను అందుకున్నదని వెల్లడించారు.
