బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘నాగిని’ సీరియల్‌తో సౌత్‌లో ఫేమస్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ, తరచూ గ్లామరస్ ఫొటోలు పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే, ఇటీవల మౌనీ రాయ్ తన భర్త సూరజ్ నంబియార్‌తో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది.
ఈ ప్రకటన వచ్చిన కొన్ని వారాల్లోనే మౌనీ రాయ్ పై వస్తున్న రూమర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తన సెక్సువల్ ఓరియంటేషన్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తాజాగా ఆమె ఖండించింది. తాను ‘గే’ అంటూ ప్రచారం జరగడం తన గురించి విన్న అతిపెద్ద, విచిత్రమైన రూమర్ అని పేర్కొంది.
ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మౌనీ రాయ్ మాట్లాడుతూ..“నేను చాలా అదృష్టవంతురాలిని. నా కుటుంబం, స్నేహితులు ఎప్పుడూ కొండంత అండగా నిలిచారు” అని చెప్పింది. ముఖ్యంగా తన మహిళా స్నేహితులు జీవితంలోని ప్రతి దశలో తనకు అండగా నిలిచారని, “నా గర్ల్‌ఫ్రెండ్స్ ప్రపంచంలోనే బెస్ట్” అని పేర్కొంది. అలాగే మహిళలు భావోద్వేగపరంగా, ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని ఆమె సూచించింది. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని, సంతోషం, బాధ, కష్టాలు అన్నీ జీవితంలో భాగమేనని మౌనీ తెలిపింది.
నాలుగేళ్ల పరిచయం అనంతరం 2022లో వివాహం చేసుకున్న మౌనీ రాయ్, సూరజ్ నంబియార్‌లు 2026లో విడిపోతున్నట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. పరస్పర అవగాహనతో ఈ నిర్ణయం తీసుకున్నామని, వ్యక్తిగత జీవితాలపై వస్తున్న తప్పుడు కథనాలను నమ్మవద్దని వారు కోరారు.
తర్వాత సూరజ్ నంబియార్ కూడా మరో ప్రకటన విడుదల చేస్తూ, భరణం, గొడవలు లేదా మూడో వ్యక్తి కారణంగా తాము విడిపోలేదని స్పష్టం చేశారు. కాగా, మౌనీ రాయ్‌కు బాలీవుడ్ నటి దిశా పటానీ అత్యంత సన్నిహిత స్నేహితురాలిగా పేరుంది. వీరి స్నేహం తరచూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది.
దిశా పటానీతో రిలేషన్‌షిప్? పుకార్లకు దారితీసిన ప్రచారం..
బాలీవుడ్‌లో మౌనీ రాయ్‌కు క్లోజ్ ఫ్రెండ్ ఎవరంటే... వెంటనే దిశా పటానీ పేరు వినిపిస్తుంది. వీరిద్దరూ తరచూ కలిసి వెకేషన్లకు వెళ్లడం, సోషల్ మీడియాలో తమ సన్నిహిత ఫొటోలను పంచుకోవడం వల్ల వారి బంధంపై పలు ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
ఈ క్రమంలోనే వీళ్లిద్దరు లెస్బియన్స్ అని, రిలేషన్ షిప్ లో ఉన్నారని.. అందుకే మౌనీ రాయ్ తన భర్తను వదిలేసిందనే దారుణమైన పుకార్లు వినిపించాయి. అయితే ఈ ప్రచారాలపై మౌనీ రాయ్ తాజాగా స్పందిస్తూ, తన గురించి విన్న అత్యంత విచిత్రమైన రూమర్ ఇదేనని స్పష్టం చేసింది.
