సింగరేణి సంస్థతో మాట్లాడి మందమర్రిలో మునీర్ విగ్రహంతో పాటు భవనం ఏర్పాటుకు కృషి చేస్తామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి సీఈఆర్ క్లబ్ లో స్వర్గీయ సీనియర్ జర్నలిస్ట్ మునీర్ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్సీ కోదండరాం,మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు,బుద్దవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, సీనియర్ సంపాదకులు రామచంద్ర మూర్తి,ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పాల్గొన్నారు. మునీర్ చిత్ర పటానికి నివాళులర్పించి పుస్తకావిష్కరణ చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి,ఎమ్మెల్సీ కోదండరాం.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. జర్నలిజంలో మునీర్ అందించిన సేవలను కొనియాడారు.జర్నలిస్ట్ మునీర్ జ్ఞాపకాలను స్మరించుకునేలా ఈ పుస్తకావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది. మా తండ్రి, స్వర్గీయ కాకా వెంకటస్వామి కుటుంబానికి మునీర్ అత్యంత ఆప్తమిత్రుడు. మందమర్రిలో మునీర్ విగ్రహంతో పాటు ఒక భవనాన్ని ఏర్పాటు చేసేందుకు సింగరేణి సంస్థతో మాట్లాడి, నా వంతు పూర్తి కృషి చేస్తాను. అని అన్నారు.
