ఎదులాబాద్ చెరువులో చేపలు మృత్యువాత

ఎదులాబాద్ చెరువులో చేపలు మృత్యువాత
  • నీటి కాలుష్యం వల్లేనన్న బీజేపీ నేత సుదర్శన్ రెడ్డి
  • కాలుష్య పరిశ్రమలను తరలించాలని డిమాండ్ 

ఘట్​కేసర్, వెలుగు: నీటి కాలుష్యంతో ఎదులాబాద్ చెరువులో వందలాది చేపలు మృత్యువాత పడ్డాయని బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ ఇన్​చార్జీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. ఎదులాబాద్ చెరువులో దాదాపు రూ.30 లక్షల చేపలు మృత్యువాత పడ్డ విషయం తెలుసుకొని సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

అనంతరం మాట్లాడుతూ.. చర్లపల్లి పరిశ్రమలు, డంపుతో చేపలు మృత్యువాత పడుతున్నాయన్నారు. దీనివల్ల మత్స్యకారులు, స్థానిక రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఇన్​ఫ్లుయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి, కాలుష్య జలాలను శుద్ధి చేయాలని కోరారు. కాలుష్య పరిశ్రమలను తరలించాలని డిమాండ్ చేశారు.