స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

 స్వదేశీ వస్తువులను  ప్రోత్సహించాలి :  ఎమ్మెల్సీ మల్క కొమరయ్య
  • బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ‘వోకల్ ఫర్ లోకల్’ గా మారాలని బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూ, విదేశీ వస్తువులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సేవాపక్షం కార్యక్రమాల్లో భాగంగా నాంపల్లిలోని హ్యాండ్లూమ్ హౌస్‌‌ను తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళా భరణం కృష్ణమోహన్ రావుతో పాటు ఆయన సందర్శించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఖాదీ, ఖద్దరు వస్త్రాలను కొనుగోలు చేశారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, వికసిత్​భారత్ వంటి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి స్వదేశీ ఉత్పత్తుల వినియోగం కీలకమని చెప్పారు. దేశీయ వస్తువులు కొనుగోలు చేయడం వలన మన పరిశ్రమలకు ప్రోత్సాహం లభించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి భారతీయుడు స్వదేశీ ఉత్పత్తుల వినియోగంలో భాగస్వామి కావాలని ఆయన కోరారు.