- కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవు: ఈటల
హైదరాబాద్, వెలుగు: డివిజన్ పాలిటిక్స్ తో తెలంగాణలో అధికారంలోకి రాలేమని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కులం, మతం రాజకీయాలు నిలబడవని, ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చిన మరుసటి రోజే ఈటల రాజేందర్ దానికి భిన్నంగా వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్ అన్నది మోదీ నినాదమని పేర్కొన్నారు.
