
- రాజ్ భవన్‌లో ఘనంగా బోనాలు
హైదరాబాద్, వెలుగు: రాజ్ భవన్‌లో ఆషాఢ మాస బోనాలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ భార్య సుధ దేవ్ వర్మ బోనమెత్తారు. మహాంకాళి అమ్మవారికి గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గవర్నర్ ప్రార్థించారు. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్‌తో పాటు రాజ్ భవన్ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.