CBSE స్కూళ్లకు మరోసారి నోటిస్.. JEE మెయిన్ రాసేవారికి 11వ తరగతి రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరి...

CBSE స్కూళ్లకు మరోసారి నోటిస్.. JEE మెయిన్ రాసేవారికి  11వ తరగతి రిజిస్ట్రేషన్ నంబర్ తప్పనిసరి...

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE)  అనుబంధ స్కూళ్లకు JEE మెయిన్ 2026 పరీక్షకు అప్లయ్ చేసుకునే విద్యార్థుల 11వ తరగతి (class XI) రిజిస్ట్రేషన్ నంబర్‌ (Registration Number) అందించడం తప్పనిసరి అని నోటిస్ జారీ చేసింది. చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు స్కూళ్లు 11వ తరగతి రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వడం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి ఫిర్యాదు చేశారు.

దింతో ఈ ఫిర్యాదులపై CBSE సీరియస్‌గా స్పందించింది. ఇంతకుముందు ఇచ్చిన సూచనలను స్కూళ్లు పాటించడం లేదని పేర్కొంటూ, అన్ని స్కూళ్లకు రిమైండర్ నోటీసు పంపింది. అలాగే JEE మెయిన్ అప్లికేషన్ ఫామ్‌లో ఈ నంబర్‌ నింపాలని NTA కోరింది. ముఖ్యంగా, ఈ రిజిస్ట్రేషన్ నంబర్ సహాయంతో JEE మెయిన్ పరీక్షల తేదీలు CBSE బోర్డు పరీక్షల (Board Exams) తేదీలతో ఒకే రోజు రాకుండా NTA షెడ్యూల్ చేసేందుకు  అవకాశం ఉంటుంది.

 JEE మెయిన్ 2026 రాసే విద్యార్థులకు స్కూళ్లు ఖచ్చితంగా 11వ తరగతి రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఇవ్వాలని CBSE మరోసారి గట్టిగా చెప్పింది.గతంలో జరిగినట్లుగా  ఈసారి కూడా JEE మెయిన్ 2026 పరీక్షలకు, 2026 బోర్డు పరీక్షలకు మధ్య తేదీల గొడవ  (Clash) లేకుండా CBSE చూసుకుంటుంది.

12వ తరగతి విద్యార్థులు JEE మెయిన్స్‌కు హాజరవుతారు కాబట్టి, బోర్డు సెషన్ 2 చివరి పరీక్షను ఏప్రిల్ 9న షెడ్యూల్ చేసింది. ఇది JEE మెయిన్స్ పరీక్షకు (ఏప్రిల్ 10) సరిగ్గా ఒక రోజు ముందు. ఈ గొడవ లేకుండా ఉండేందుకు CBSE 2026 బోర్డు పరీక్షల తేదీలను కొన్ని సబ్జెక్టులకు (అకౌంటెన్సీ, సైకాలజీ, జాగ్రఫీ, బిజినెస్ స్టడీస్ వంటివి) సవరించినట్లు కూడా తెలిపింది.