హైదరాబాద్ సిటీ/గండిపేట/పంజాగుట్ట/ముషీరాబాద్/మల్కాజ్ గిరి/ వికారాబాద్, వెలుగు: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ ఏకశిల అడ్మినిస్ట్రేటివ్ భవనంలో అడ్మినిస్ట్రేటివ్ డిప్యూటీ డైరెక్టర్ కె.ఆర్.కె.ప్రసాద్, నిమ్స్ దవాఖానలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, హాస్పిటల్డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ ఐలమ్మ ఫొటోలకు నివాళి అర్పించారు. ట్యాంక్ బండ్ వద్ద ఐలమ్మ ఫ్లెక్సీకి బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్నివాళి అర్పించారు.
ట్యాంక్‌బండ్‌పై ఆమె విగ్రహం పెట్టాలని డిమాండ్‌చేశారు. లోయర్ ట్యాంక్ బండ్ లోని ఐలమ్మ విగ్రహానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ చైర్మన్ నరసింహ, హైకోర్టు జడ్జి సూరేపల్లి నంద, మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్ చౌరస్తాలో లక్ష్మీనరసింహ రజక సంఘం కార్యదర్శి కాసర్ల నాగరాజు, వికారాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ దీపక్ తివారీ ఐలమ్మ ఫొటోలకు నివాళి అర్పించారు.
