నెక్ట్స్ స్టాప్ చంద్రుడే.. చివరి ఘట్టానికి చేరిన చంద్రయాన్ - 3

నెక్ట్స్ స్టాప్ చంద్రుడే.. చివరి ఘట్టానికి చేరిన చంద్రయాన్ - 3

ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగం మరో కీలక ముందడుగు వేసింది. జాబిల్లిపై సేఫ్ ల్యాండింగ్ ఇక లాంఛనమే కానుంది. ఇప్పటికే చంద్రయాన్ 3 మిషన్ కీలకమైన అన్ని దశల్ని విజయవంతంగా దాటుకుని చంద్రునికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో నిలబడి లక్ష్యానికి చేరువలో ఉంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23 సాయంత్రం చంద్రునిపై విజయవంతంగా అడుగుపెట్టనుంది.

రెండో, చివరి డీ- బూస్టింగ్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసినట్టు ఇస్రో ఆగస్టు 19 అర్థరాత్రి ప్రకటించింది. దీంతో విక్రమ్ మాడ్యుల్ చంద్రుడికి అతి చేరువగా చేరింది. ఈ కీలక ఘట్టం పూర్తి కావడంతో ల్యాండర్ ఇక చంద్రుడి ధక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే మిగిలి ఉంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల 23న ల్యాండర్.. జాబిల్లిపై ల్యాండ్ అవుతుంది. రెండో, చివరి డీ- బూస్టింగ్ ఆపరేషన్ తో ల్యాండర్ మాడ్యుల్ 25 కి.మీ. 134 కి.మీ కక్ష్యలోకి చేరింది. మాడ్యుల్ ను అంతర్గతంగా చెక్ చేయాల్సి ఉంది. ఎంచుకున్న ల్యాండింగ్ సైట్ లో సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం. చంద్రుడిపై అడుగు పెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సా. 5.45గంటలకు ప్రారంభం కానుంది అని ఇస్రో ఎక్స్ ద్వారా తెలియజేసింది.