- ఎయిర్పోర్ట్, సికింద్రాబాద్ తరహాలో అమలు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: శంషాబాద్ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అమలు చేస్తున్న యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్ విధానాన్ని ఇక నుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్లోనూ అమలు చేయబోతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్లాట్ఫారం నంబర్9వైపున ఇది అమలు చేయనున్నారు. ఇక్కడ పార్కింగ్‌కోసం 6,622.09 చదరపు మీటర్ల స్థలం కేటాయించారు. అనధికార వాహనాలు పార్కింగ్ స్థలంలోకి రాకుండా ఈ సిస్టమ్అడ్డుకుంటుంది.
అలాగే వాహనాలకు భద్రత ఉంటుంది. పార్కింగ్ ఫీజులు కూడా ఆటోమెటిక్‌గా చేయొచ్చు. రైల్వే స్టేషన్ ముందు నడిచిపోవడానికి అడ్డంకులు లేకుండా, టూ వీలర్నుంచి ఫోర్‌వీలర్ల వరకు సెపరేట్లైన్స్ఏర్పాటు చేశారు. పికప్ అండ్ డ్రాప్ ను కూడా అనుమతిస్తున్నామన్నారు. సికింద్రాబాద్ ప్లాట్‌ఫాం నంబర్10 వైపు ఇప్పటికే ఈ విధానం ఉందని, పికప్ లేదా డ్రాప్ కోసం వచ్చే వాహనాలకు మొదటి 20 నిమిషాలు ఉచితమని, తర్వాత నిమిషాలు, గంటలను బట్టి ఛార్జీలు ఉంటాయన్నారు.
