ఒప్పందాలు ఉల్లంఘిస్తే సంబంధాలు దెబ్బతింటాయని హెచ్చరిక

ఒప్పందాలు ఉల్లంఘిస్తే సంబంధాలు  దెబ్బతింటాయని హెచ్చరిక

న్యూఢిల్లీ: గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించడం వల్లే రెండు దేశాల మధ్య సంబంధాల దెబ్బతింటున్నాయని.. ఇది మొత్తం ద్వైపాక్షిక సంబంధాల ప్రక్రియకే ప్రమాదమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్​సింగ్ చైనాను హెచ్చరించారు.

గాల్వాన్ ఘటన తర్వాత రెండు దేశాల రక్షణ మంత్రులు గురువారం ఢిల్లీలో తొలిసారి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫుతో ఆయన పలు విషయాలపై చర్చించారు.

తర్వాత రాజ్ నాథ్ మాట్లాడుతూ.. ఇండియా చైనా మధ్య సంబంధాలు దెబ్బతినడానికి సరిహద్దులో ఉద్రిక్తతలే కారణమన్నారు. ఒప్పందాలు ఉల్లంఘిస్తే పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.