మహిళా ఎస్‌ఐపై చేతులేస్తావా?

మహిళా ఎస్‌ఐపై చేతులేస్తావా?

రాజన్న సిరిసిల్ల టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మనోజ్‌కు స్థానిక సీఐ వార్నింగ్ ఇచ్చారు. ఒక మహిళా ఎస్ఐపై చేతులు ఎలా వేస్తావంటూ ఫైర్ అయ్యారు. అవసరం లేని చోటకు ఎందుకు వస్తావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  సీఐ  హెచ్చరిస్తున్నా లెక్కచేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు మనోజ్, అతని స్నేహితులు.  కొన్ని రోజుల క్రితం కలెక్టర్ రేట్ వద్ద జరిగిన  బీజేపీ ధర్నాను అడ్డుకునేందుకు మనోజ్ నేతృత్వంలోని టీఆర్ఎస్ యూత్ కార్యకర్తలు యత్నించారు. ఇవాళ కూడా బీజేపీ నేతలు రసమయి దిష్టిబొమ్మ తగలబెడుతుండగా అక్కడికి వచ్చారు మనోజ్, అతని స్నేహితులు.