భద్రాద్రి రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

భద్రాద్రి రామయ్యకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

భద్రాద్రి రాములోరి కళ్యాణం వైభంగా జరుగుతోంది. స్వామివారికి సీఎం రేవంత్ రెడ్డి  పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు  సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి పలువురు మంత్రులు స్వామి వారి కళ్యాణంలో పాల్గొన్నారు.

 మిథులా స్టేడియంలో సీతారాముల కల్యాణ వేడుకను వేదపండితులు ఘనంగా నిర్వహిస్తున్నారు. రామదాసు చేయించిన మంగళసూత్రంతో అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు సీతారాముల కల్యాణ కృతువును వేద పండితులు పూర్తిచేయనున్నారు.రామదాసు చేయించిన ఆభరణాలు.. రామయ్యకు పచ్చలహారం, సీతమ్మకు  చింతాకు పతకంతో అలంకరించారు. రాములోరి కల్యాణానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కల్యాణంను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు పొటెత్తారు.  భద్రాచలం వీధులన్నీ  శ్రీరామనామస్మరణతో మార్మోగాయి.