దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర ఏంటి.? : సీఎం రేవంత్

దేశ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర ఏంటి.? :  సీఎం రేవంత్

జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ డీజీపీ రామ్మోహన్ రావు రాసిన  గవర్నర్ పేట్ నుంచి గవర్నర్ హౌస్ పుస్తక  ఆవిష్కరణలో పాల్గొన్నారు రేవంత్. గతంలో జాతీయ రాజకీయాలను శాసించే స్థాయి మనకు ఉండేదన్నారు.  సంజీవ రెడ్డి, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు లాంటి  తెలుగు వారు  ఢిల్లీలో తెలుగుపై గుర్తింపు తెచ్చారని చెప్పారు.  ఇపుడు ఫుల్ టైమ్ పాలిటిక్స్ చేసేవాళ్లు లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. 

జాతీయ స్థాయిలో తెలుగు భాష రెండో స్థాయిలో ఉన్నప్పుడు రాజకీయాల్లో అంతటి ప్రభావం చూపించాలేకపోతున్నామని తెలిపారు రేవంత్. ఒకప్పుడు  నార్త్  నుంచి ప్రధాని ఉంటే.. సౌత్ కు  రాష్ట్రపతి పదవి ఇచ్చేవారు.. కానీ ఇపుడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు.  దేశ రాజకీయాల్లో మన పాత్ర ఏమిటో చర్చించాలన్నారు. తమ ప్రభుత్వానికి భేషజాలు లేవని..  అనుభవం కలిగిన వారి సూచనలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.  రాష్ట్రాలుగా విడిపోయినా..మనుషులుగా కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్.