అమెరికాలో బిజీ బిజీ.. యాపిల్ పార్కుని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

అమెరికాలో బిజీ బిజీ.. యాపిల్ పార్కుని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధే లక్ష్యంగా సీఎం రేవంత్​రెడ్డి టీమ్​ అమెరికా పర్యటన సాగుతున్నది. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వివిధ కంపెనీలతో ఐదు రోజుల్లోనే 10 పెద్ద ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో కాగ్నిజెంట్, వాల్ష్​ కార్రా, స్వచ్ఛ్​ బయో, ట్రైజిన్​ టెక్నాలజీస్​ లాంటి కంపెనీలున్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడ్తున్న వివిధ ప్రాజెక్టులకు వరల్డ్​బ్యాంక్ ​సహకారాన్ని సాధించడం విశేషం.

 బుధవారం రాత్రి వరకు న్యూయార్క్​, న్యూజెర్సీ, వాషింగ్టన్, డల్లాస్, టెక్సాస్​లో పర్యటించిన సీఎం రేవంత్​ రెడ్డి టీమ్​ గురువారం కాలిఫోర్నియా చేరుకున్నది. గురువారం రోజు కాలీఫోర్నియాలోని యాపిల్ పార్క్ ని సందర్శించారు. 175 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్యాంపస్ అనేక రంగాలలో ప్రముఖ పెట్టుబడి గమ్యస్థానంగా హైదరాబాద్ మరియు తెలంగాణకు బలమైన పిచ్‌ని రూపొందించడానికి అనువైన ప్రదేశమని తెలిపారు.

 ఆగస్టు 4  2024 నుంచి అమెరికాలో సీఎం రేవంత్​ టీం పెట్టుబడుల యాత్ర మొదలైంది. తొలిరోజు కాగ్నిజెంట్..  అమెరికా తర్వాత హైదరాబాద్‌లో అతి పెద్ద క్యాంపస్ ఏర్పాటుకు ఎంవోయూ చేసుకున్నది. దీంతో దాదాపు 15,000 ఉద్యోగాలు రానున్నాయి.