అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కొలిన్ పావెల్ కరోనాతో మృతి

అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కొలిన్ పావెల్ కరోనాతో మృతి

న్యూయార్క్: అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి కొలిన్‌ పావెల్‌ (84) కరోనాతో మృతి చెందారు. ఆయన మృతి వార్తను కుటుంబ సభ్యులు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ఆయన పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వేయించుకున్నారని.. అయినప్పటికీ కోవిడ్ సంబంధిత సమస్యలు రావడంతో వాల్టర్ రీడ్ నేషనల్ మెడికల్ సెంటర్ లో చేర్పించామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. 
జార్జిబుష్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న సమయంలో 2001 నుంచి 2005 వరకు ఆయన విదేశాంగ మంత్రిగా వ్యవహరించారు. అమెరికా జాయింట్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్స్‌ ఛైర్మన్‌గా కూడా జనరల్‌ పావెల్‌ పనిచేశారు. అమెరికా ఇరాక్‌పై యుద్ధం చేసిన విషయంలో ఆయన తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. జార్జి బుష్ రెండోసారి 2004లో అధ్యక్షుడిగా ఎన్నికైనా... కొలిన్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది.