నాగ్ పూర్ లో వారం రోజులు పూర్తి లాక్ డౌన్

నాగ్ పూర్ లో వారం రోజులు పూర్తి లాక్ డౌన్

మహారాష్ట్ర లో రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాగ్ పూర్ లో మార్చి 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించింది. కిరాణా షాపులు, పాలు, కూరగాయలు వంటి నిత్యావసరాలతో పాటు అత్యవసర సేవలు మినహా మిగతా అన్నింటినీ మూసేస్తున్నట్టు ప్రకటించింది. నాగ్ పూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లోనూ లాక్ డౌన్ నిబంధనలు, ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మంత్రి నితిన్ రౌత్ గురువారం దీనిపై అధికారిక ప్రకటన చేశారు. ఏడాది క్రితం ఇదే రోజున నాగ్ పూర్ లో  మొదటి కరోనా కేసు నమోదు కావడం.. మళ్లీ అదే రోజున మరోమారు సంపూర్ణ లాక్ డౌన్ ను విధిస్తున్నట్టు ప్రకటించింది.


గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,854 కరోనా కేసులు నమోదైతే.. ఒక్క మహారాష్ట్రలోనే 13,659 మందికి పాజిటివ్ గా తేలింది. మొత్తం కేసుల్లో 60 శాతానికిపైగా అక్కడే వస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడుల్లోనే 85 శాతం కేసులు నమోదవుతున్నాయి.