
హైదరాబాద్, వెలుగు: బూటకపు ఎన్కౌంట ర్లు పౌరహక్కులను కాలరాయడమే అవుతుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, హోంమం త్రి అమిత్ షా మావోయిస్టులను అంతం చేయ డమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టి బూటకపు ఎన్కౌంటర్లు చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధపడినప్పుడే వారు పునరాలోచనలో ఉన్నారని గ్రహించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.