V6 News

Deepika Padukone: రెండో ప్రెగ్నెన్సీ ప్రకటించిన దీపిక పదుకొనే.. క్యూట్ ఫోటోతో గుడ్ న్యూస్

Deepika Padukone: రెండో ప్రెగ్నెన్సీ ప్రకటించిన దీపిక పదుకొనే.. క్యూట్ ఫోటోతో గుడ్ న్యూస్

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్ రణ్వీర్ సింగ్ (Ranveer singh), దీపికా పదుకొనె (Deepika Padukone) తమ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ జంట తమ రెండో బేబీకి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అయ్యారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా ప్రెగ్నెన్సీని అధికారికంగా ప్రకటించారు. ఇదే విషయంపై కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చారు దీపిక. 

ఆదివారం (ఏప్రిల్ 19, 2026న) దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. తమ కుమార్తె దువా తో కలిసి క్యూట్ ఫోటో షేర్ చేస్తూ ఈ శుభవార్త వెల్లడించారు. ముఖ్యంగా దీపికా తన మొదటి దువా చేతిలో పాజిటివ్‌గా చూపిస్తున్న ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్‌తో ఉన్న ఫోటో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ పోస్ట్‌కు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈ జంట 2018లో పెళ్లి చేసుకుని, 2024 సెప్టెంబర్‌లో అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందారు. వీరి పాపకు “దువా” అని పేరు ప్రకటించి అందరి ఆశీస్సులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు రెండో బిడ్డ కూడా వస్తుందంటూ పోస్ట్ చేసి మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు.

దీపికా పదుకునే ‘రాకా’ (Raaka):

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్షర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రాకా’ (Raaka) .  సుమారు 800 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. ఇందులో వీర యోధురాలి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం దీపికా రూ.25 కోట్ల ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, షారుఖ్ ఖాన్తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న కింగ్ మూవీలో కూడా నటిస్తుంది. ఇక రణవీర్ సింగ్ ఇటీవల విడుదలైన ధురంధర్ 2 విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.