ఎలాన్ మస్క్ X యాప్‌లో కొత్త సర్వీస్.. ఇకపై సోషల్ మీడియాతో పాటు బ్యాంకింగ్ సర్వీసులు !

  ఎలాన్ మస్క్  X యాప్‌లో కొత్త సర్వీస్.. ఇకపై  సోషల్ మీడియాతో పాటు బ్యాంకింగ్ సర్వీసులు !

బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన X సంస్థ అమెరికాలో 'X మనీ' పేరుతో ఒక కొత్త సర్వీస్ అధికారికంగా ప్రారంభించింది. ఇప్పటివరకు  కొంతమందికి మాత్రమే బీటా వెర్షన్లో అందుబాటులో ఉన్న ఈ సర్వీస్.. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఎక్స్ ప్రీమియం, ప్రీమియం+  యూజర్లకి అందుబాటులోకి తీసుకొచ్చారు.

దీని ద్వారా ఇకపై ఎక్స్ యాప్‌లోనే సోషల్ మీడియా వాడుతూ.. బ్యాంకింగ్ పనులు కూడా చేసుకోవచ్చు. ఈ యాప్ అభివృద్ధి ఆలోచనలో భాగంగా ఎలోన్ మస్క్ ఈ ఫీచర్‌ను తీసుకువచ్చారు.

X మనీ ప్రత్యేకతలు & లాభాలు:

ఫ్రీ ట్రాన్సక్షన్స్: ఎక్స్ యూజర్ల ఇప్పుడు ఒకరికి ఒకరు ఎలాంటి ఎక్స్ట్రా  చార్జెస్ లేకుండా వెంటనే డబ్బు పంపుకోవచ్చు, పొందవచ్చు.

భారీ వడ్డీ & క్యాష్‌బ్యాక్: ఈ  యాప్ అకౌంట్‌లో ఉంచే డబ్బుపై 6% వరకు ఏడాది వడ్డీ (APY) పొందవచ్చు. అలాగే ఎక్స్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే 3% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

 జీతం: సాధారణంగా జీతం పడే తేదీ కంటే రెండు రోజుల ముందే మీ అకౌంట్‌కు డబ్బులు వచ్చేలా 'ఎర్లీ డైరెక్ట్ డిపాజిట్' సౌకర్యం ఉంది.

వీసా డెబిట్ కార్డ్: ప్రతి యూజర్‌కు వర్చువల్ 'X కార్డ్' వస్తుంది. దీన్ని ఆపిల్ వాలెట్ లేదా గూగుల్ పేకు కనెక్ట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మెటల్‌తో చేసిన ఫిజికల్ డెబిట్ కార్డును కూడా ఆర్డర్ చేయవచ్చు. ఈ కార్డ్‌పై మన పేరుతో పాటు ఎక్స్ యూజర్‌నేమ్ కూడా ఉండేలా కస్టమైజ్ చేసుకోవచ్చు. విదేశాల్లో దీన్ని వాడేందుకు  ఎలాంటి ఎక్స్‌ట్రా ఫీజులు ఉండవు.

'X మనీ' అంటే ఏమిటి?
ఇది సోషల్ మీడియా యాప్‌లో బ్యాంకింగ్ సర్వీసెస్ అందించే ఒక లేటెస్ట్ ఫీచర్. దీని ద్వారా యూజర్లు సోషల్ మీడియా వాడుతూనే డబ్బులు పొందడం, పంపడం వంటి బ్యాంకింగ్ పనులు చేసుకోవచ్చు. ఎలోన్ మస్క్ కల అయిన 'ఎవ్రీథింగ్ యాప్'.. అంటే అన్ని సేవలు ఒకే యాప్‌లో ఉండే లక్ష్యంలో భాగంగా దీన్ని తీసుకువచ్చారు.