ఇండియా ఎక్ప్పో సెంటర్ లో ఈవీ ఇండియా 2022 ఇండియా బిగ్గెస్ట్ మోటర్ వెహికల్ షో ఈ నెల 7 నుంచి 9 వరకు కొనసాగనుంది. ఈ షోలో వివిధ కంపెనీలు100కు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఇండియన్ మోటర్ ఎలక్ట్రానిక్ షోలో స్పెషల్ అట్రాక్షన్ గా ఆటమ్ బైక్స్ నిలవనున్నాయి. తమ కంపెనీలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ బైక్ లని, స్కూటీలని, వాటి విడిభాగాలని షోలో నిర్వాహకులు ప్రదర్శించారు.
స్పెషల్ అట్రాక్షన్ గా ఆటమ్ వెడర్, ఆటమ్ 1.ఓ బైక్స్
ఇక ఈ షోలో ఎలక్ట్రికల్ వెహికల్స్ రంగంలో విశాఖ గ్రూప్ కు చెందిన ఆటో మొబైల్ lకంపెనీ బైక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. కంపెనీ... ఆటమ్ వెడర్, ఆటమ్ 1.ఓ బైక్స్ ను ఈ షోలో ప్రదర్శనకు ఉంచింది. తక్కువ ధర, బెస్ట్ వెహికల్స్ కావడంతో పెద్ద ఎత్తున ఈ వెహికల్స్ డీలర్ షిప్, వెహికల్స్ కొనుగోలు చేసేందుకు విజిటర్స్ ఆసక్తి చూపుతున్నట్లు ఆటో మొబైల్ కంపెనీ సేల్స్ మేనేజర్ తెలిపారు. గంటకు 25 కి. మీ వేగంతో ప్రయాణించే ఆటమ్ 1.ఓ కు వెహికల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైనెస్స్ అవసరం లేదని ఆయన తెలిపారు. ఇక ఆటమ్ వెడర్ గంటకు 65 కి.మీ వేగంతో దూసుకుపోతుందని ఆయన చెప్పారు. ఈవీ ఎక్స్ లో పెద్ద ఎత్తున విజిటర్స్ కొనేందుకు డీలర్ షిప్ తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. ఆటమ్ వెడర్ ధర రూ.1 లక్ష, ఆటమ్ 1.ఓ ధర రూ.70 వేలకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి.
దేశంలోని పలు ప్రాంతాల్లో డీలర్స్
ప్రస్తుతం ఢిల్లీ, ముంబయి, యూపీ, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, బీహార్ తో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో తమ కంపెనీకి డీలర్స్ ఉన్నట్లు మేనేజర్ తెలిపారు. అలాగే.. విశాఖ కు చెందిన సోలార్ చార్జింగ్ స్టేషన్ ను ఇక్కడ ప్రదర్శించారు. ఇండ్ల పైకప్పుగానే కాకుండా ఇంటికి విద్యుత్, ఎలక్ట్రికల్ వెహికల్ చార్జింగ్ పాయింట్ గా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు
