వెంకటేశ్వరస్వామి గుడిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు

వెంకటేశ్వరస్వామి గుడిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
  • రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ ఘాట్ లో ఘటన

రంగారెడ్డి జిల్లా: పురాతనమైన వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. జిల్లాలోని మంచాల మండలం కాగజ్ ఘాట్ గ్రామంలో జరిగిందీ ఘటన. సుమారు 400 సంవత్సరాల చరిత్ర గల అతిపురతమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలో తవ్వకాల ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. 
ఎప్పటిలాగే ప్రతి రోజు ఉదయం భక్తులు ఈ ఆలయంలోని స్వామిని దర్శించుకోవడానికి వెళ్లగా గుర్తుతెలియని దుండగులు ముఖ ద్వారాలు ద్వంసం చేయడం కనిపించింది. ఏదో అపశృతి జరిగిందని అనుమానిస్తూ గర్భగుడి దగ్గరకు వెళ్లి చూడగా.. అక్కడ తవ్వకాలు జరిపినట్లు భక్తులు గుర్తించారు. ఈ విషయాన్ని మంచాల పోలీసులకు తెలియజేయగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంలతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఏసీపి బాలకృష్ణ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.