మిగిలిన డబ్బులు కట్టి మృతదేహాన్నీ తీసుకెళ్లండి..

మిగిలిన డబ్బులు కట్టి మృతదేహాన్నీ తీసుకెళ్లండి..

హైద‌రాబాద్: క‌రోనా పేరుతో కొన్ని ప్రైవేట్ హాస్పిట‌ల్స్ భారీగా దోచుకుంటున్నాయ‌ని.. అయినా ప్రాణాలు ద‌క్క‌డంలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు క‌రోనాతో చ‌నిపోయిన ఓ కుటుంబ స‌భ్యులు. సోమ‌వారం హైద‌రాబాద్ లోని, ఆయుష్ హాస్పిట‌ల్ లో త‌మ బంధువు చ‌నిపోయాడ‌ని.. ఇప్ప‌టికే రూ. 11 ల‌క్ష‌లు క‌ట్టించుకున్నార‌ని మిగిలిన ల‌క్ష క‌డితేనా డెడ్ బాడీ ఇస్తామ‌ని హాస్పిట‌ల్ యాజ‌మాన్యం ఒత్త‌డి చేస్తుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

మ‌హ‌బూబాబాద్ కు చెందిన శ్రీద‌ర్ కు ఇటీవ‌ల క‌రోనా సోక‌గా ..దిల్ సుఖ్ న‌గ‌ర్ లోని  ఆయుష్( ప్రైవేట్) లో అడ్మిట్ చేశామ‌న్నారు. అయితే 11 రోజుల నుండి ట్రీట్ మెంట్ చేసిన ఆయుష్ హాస్పిల్.. ఇప్ప‌టివ‌ర‌కు రూ.11 ల‌క్ష‌లు క‌ట్టించుకుంద‌న్నారు. శ్రీధ‌ర్ కోలుకుంటున్నాడ‌ని అబ‌ద్దాలు చెబుతూ ల‌క్ష‌లు లాగార‌ని..చివ‌ర‌కు చ‌నిపోయాడ‌ని..మిగిలిన డ‌బ్బులు క‌ట్టి, డెడ్ బాడీ తీసుకెళ్ల‌మ‌ని ఎలా చెబుతారంటూ హాస్పిట‌ల్ యాజ‌మాన్యంపై సీరియ‌స్ అయ్యారు. ప్ర‌భుత్వ అధికారులు, పోలీసులు, ప్ర‌జా ప్ర‌తినిధిలు స్పందించి వెంట‌నే హాస్పిట‌ల్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు శ్రీధ‌ర్ కుటుంబ స‌భ్యులు.