అమెరికాలో ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనునయ్ మృతి : షాక్‌లో ఫాలోవర్స్.. 32 ఏళ్లకే ఎలా చనిపోయాడు..?

 అమెరికాలో ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనునయ్ మృతి : షాక్‌లో ఫాలోవర్స్.. 32 ఏళ్లకే ఎలా చనిపోయాడు..?

దుబాయ్‌కి చెందిన ప్రముఖ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్,  ఫోటోగ్రాఫర్ అనునయ్ సూద్ 32 ఏళ్ల  వయసులో లాస్ వెగాస్‌లో మరణించాడు. ఈ విషయాన్నీ ఆయన కుటుంబం సోషల్ మీడియా ద్వారా ధృవీకరించగా.. అతని మరణానికి కారణం వెల్లడించలేదు. సమాచారం ప్రకారం అతను లాస్ వెగాస్‌లో ఉండగా గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుంది. 

 అనునయ్ సూద్ ఎవరు: ఇన్‌స్టాగ్రామ్‌లో 14 లక్షల మంది ఫాలోవర్స్, యూట్యూబ్‌లో 3.8 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లతో అనునయ్ అత్యంత ఫెమస్  ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో ఒకరు. 

నవంబర్ 04న షేర్ చేసిన సూద్ చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం, అతను కాన్కోర్స్‌కు అటెండ్ కావడానికి నెవాడాలోని విన్ లాస్ వెగాస్‌ వెళ్ళాడు. ఈ ఈవెంట్‌ను లాస్ వెగాస్ కాన్కోర్స్ డి'ఎలిగాన్స్ అని కూడా పిలుస్తారు, ఇక్కడ ఈ ఈవెంట్ అంతా లగ్జరీ & డిజైనర్ కార్ల గురించి. అనునయ్ సూన్ ఇప్పటికి 46 దేశాలను సందర్శించాడు అలాగే  ప్రపంచంలోని 195 దేశాలను కూడా సందర్శించాలనుకున్నాడు. ఫోర్బ్స్ ప్రకారం, దుబాయ్‌కు చెందిన ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ 2024 టాప్ 100 డిజిటల్ స్టార్‌లలో కూడా ఉన్నాడు.

ఆయన మరణ వార్త సోషల్ మీడియాలో బయటికి వచ్చిన వెంటనే నెటిజన్లు  షాక్‌కు గురయ్యారు.. కొందరు సంతాపాన్ని వ్యక్తం చేయగా..  మరికొందరు అతని ఈ అకాల మరణం పట్ల విచారాన్ని వ్యక్తం చేసారు. 

 అనునయ్ సూద్ నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. తరువాత అతను ఆటోమొబైల్ & ఆటోమోటివ్ మెకానిక్స్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ డిగ్రీ చేసాడు, నోయిడాలోని అమిటీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. అనునయ్ సూద్  అనునయ్ రీతు, రాహుల్ సూద్ కుథియాల కుమారుడు. అతనికి ఇద్దరు సోదరీమణులు రచితా సూద్, ఇషితా సూద్ ఉన్నారు. సమాచారం  ప్రకారం అతనికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది.